పోలవరం ప్రాజెక్ట్ దశాబ్దాల కల.ఈ కల ఎప్పటికి నెరవేరుతుంది.
ముఖ్యమంత్రులు మారుతున్నారు.
వచ్చిన ప్రతీ ముఖ్యమంత్రులూ డెడ్ లైన్లు పెడుతున్నారు కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడంలేదు.
తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యంపై కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్లే ప్రాజెక్టు ఆలస్యమవుతుందని విరుచుకుపడింది.పోలవరం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ గాథ.1941లో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజినీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
దీనికి రామపాద సాగర్ అని పేరు పెట్టారు నిర్మాణ వ్యయం.నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత కారణంగా రామపాద సాగర్ కి ముందడుగు పడలేదు.తరువాత చాలా సార్లు ప్రతి పాదనలు వచ్చినా ముందుకు సాగలేదు.చివరికి 2004 ఈ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది.2004 లో పనులు ప్రారంభమయ్యయి దీని ద్వారా ప్రాజెక్ట్ కట్టడానికి అవసరమైన మొత్తం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది.అయితే వచ్చిన రాష్ఠ్ర ప్రభుత్వాల అసమర్థత వల్ల ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగడంలేదు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పారు.కానీ అది జరగలేదు.
తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ 2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.అది కూడా జరగలేదు.పోలవరం ఆలస్యానికి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులేనని జగన్ చెప్పారు.
దీంతో పోలవరం ప్రాజెక్టుపై ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పోలవరం ఆలస్యం కావడానికి అంచనా వ్యయం పెంచడం కోసమేననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దీంతో చివరికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర జల శక్తి శాఖ 2024 జూలై వరకూ గడువును పొడిగించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షం వల్ల అలస్యమైందని చెప్పింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy