కొత్త మిష‌న్‌ను ప్రకటించిన కేంద్ర ప్ర‌భుత్వం..!

తాజాగా మిషన్‌ కర్మయోగి పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.దీనికి సంబంధించి సివిల్‌ సర్వీసులపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఈ అంశానికి సంబంధిచిన వివరాలను మీడియాకు తెలిపారు.ఈ కమిషన్ ని సివిల్ సర్వీసుల సామర్ధ్యాన్ని పెంచడం కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు.

ఇక బుధవారం ప్రధాని అధ్యక్షతన ఈ కెబినెట్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే మంత్రి మీడియా ద్వారా తెలిపారు.

సివిల్ సర్వీసుల అభ్యర్థులను తీర్చిదిద్దడానికి ఎంతో దోహదపడుతుందని వెల్లడించారు.అంతేకాకుండా వారిని అన్ని అంశాలపై పట్టుసాధించేలా మిషన్‌ కర్మయోగి సహాయ పడుతుందని అన్నారు.

Advertisement

ఇక పౌర అధికారులు భార‌తీయ సివిల్ స‌ర్వెంట్ల‌ను భ‌విష్య‌త్తుకు త‌గిన విదంగా త‌యారు చేస్తామ‌న్నారని వెల్లడించారు.ఇక సృజ‌నాత్మ‌కంగా, నిర్మాణాత్మకంగా, ప్రొఫెష‌న‌ల్‌గా, ఉత్సహంగా పార‌ద‌ర్శ‌కంగా, టెక్నాల‌జీ తెలిసి ఉండే సివిల్ స‌ర్వెంట్ల‌ను తయారు చేయడమే మిషన్‌ కర్మయోగి ఉద్దేశం అని కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

ఇక జమ్ము కశ్మీర్‌లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు, ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు