తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఖరారు అయింది.

ఈ మేరకు వచ్చే నెల 3 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించనుంది.

పర్యటనలో భాగంగా రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించనున్నారు.

తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది.అదేవిధంగా రాష్ట్ర సీఎస్, డీజీపీతో కూడా ఈసీ బృందం సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement