పార్లమెంట్‎లో కేంద్ర కేబినెట్ భేటీ..!

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మరికాసేపటిలో కేబినెట్ భేటీ కానుంది.ఈ మేరకు వార్షిక బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

తర్వాత పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.కాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇదే ఐదోసారి.

అదేవిధంగా ఎన్టీయే -2 సర్కార్ చివరి, పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.ఇప్పటికే నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు.

సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.దీనిని కేంద్రం అమృత్ కాల్ బడ్జెట్ గా అభివర్ణించింది.

Advertisement

ఈ వార్షిక బడ్జెట్ లో రక్షణ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు