కేంద్రం తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేస్తోందిః సీఎల్పీ నేత భ‌ట్టి

తెలంగాణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆరోపించారు.ఎనిమిది సంవ‌త్స‌రాలుగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.

అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కేంద్రం గొడ‌వ‌లు పెడుతోంద‌ని మండిప‌డ్డారు.ఏపీకి విద్యుత్ బ‌కాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేంద్రం నుండి రావాల్సి రూ.ల‌క్ష కోట్లు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ‌కు బ‌య్యారం ఉక్కు క‌ర్మాగారం, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్, ట్రైబ‌ల్ విశ్వ విద్యాల‌యం ఇవ్వాల‌న్నారు.

అభివృద్ధి విష‌యంలో రాజ‌కీయాల‌కు అతీతంగా కాంగ్రెస్ ప‌ని చేస్తుంద‌ని భ‌ట్టి స్ప‌ష్టం చేశారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు