మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులకు సీబీఐ బృందం చేరుకుంది.

ఈ క్రమంలో సీబీఐ విచారణకు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి హాజరైయ్యారని సమాచారం.అనంతరం పులివెందులలో పర్యటించి, మరి కొంతమంది అనుమానితులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement