ముగిసిన సీబీఐ కస్టడీ.. రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు బోయినపల్లి అభిషేక్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది.

దీంతో ఆయనను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈ నేపథ్యంలో అభిషేక్ రావును మరో రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.గడిచిన మూడు రోజుల కస్టడీలో ఆర్థిక లావాదేవీలు, లిక్కర్ పాలసీ సమావేశాలు, హవాలా వ్యవహారాలపై అభిషేక్ ను అధికారులు ప్రశ్నించారు.

ఈ క్రమంలో లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు