లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి..!

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి లభించింది.

ఈ మేరకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) పర్మిషన్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో వచ్చే వారం కవితను తీహార్ జైలులో సీబీఐ ప్రశ్నించనుంది.జైలులోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అయితే కవితను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు సూచించింది.అదేవిధంగా లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ ప్రశ్నించవచ్చని పేర్కొంది.

కాగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు