క్యాలీఫ్లవర్ పంట విత్తుకునే విధానం.. ఎరువుల యాజమాన్యంలో మెళుకువలు..!

క్యాలీఫ్లవర్ పంట( Cauliflower crop ) చల్లని తేమతో కూడిన వాతావరణపు పంట.

ఈ పంటను అధిక విస్తీర్ణంలో ఒకేసారి సాగు చేయకుండా విడతల వారీగా సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొందవచ్చు.

ముఖ్యంగా క్యాలిఫ్లవర్ పంట విత్తుకునే విధానం, ఎరువుల యాజమాన్యంలో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Cauliflower Sowing Method Techniques In Fertilizer Management , Cauliflower Crop

క్యాలీఫ్లవర్ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు( Red soils, black soils ) చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పిహెచ్ విలువ 5.5-6.5 మధ్యన ఉంటే ఈ పంట సాగుకు చాలా అనుకున్నాం.క్యాలీఫ్లవర్ పంట నాటుకోవడానికి ముందు నేలను లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు( Cattle manure ), 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఎరువులు వేసి పొలాన్ని కలియదున్నాలి.

ఆ తర్వాత నేల వదులుగా అయ్యేలా రెండు లేదా మూడుసార్లు దున్నుకోవాలి.ఒక ఎకరం పొలానికి 250 గ్రాముల విత్తనాలు అవసరం.నేల నుండి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే ముందుగా విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి.

Advertisement
Cauliflower Sowing Method Techniques In Fertilizer Management , Cauliflower Crop

ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి.

Cauliflower Sowing Method Techniques In Fertilizer Management , Cauliflower Crop

10 నుండి 15 అడుగుల ఎత్తులో ఉండే నారు మడులలో పెరిగిన తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును మాత్రమే ఎంపిక చేసుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి.ముఖ్యంగా నారు వయసు 25 నుండి 30 రోజుల మధ్య ఉంటేనే ప్రధాన పొలంలో నాటుకోవాలి.పంటకు వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల బెడద( Pests ) తక్కువగా ఉండాలంటే.

మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు ఒక ఎకరం పొలంలో 16 వేల మొక్కలు నాటుకోవాలి.కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా మచ్చలు లేకుండా నాణ్యతగా ఉండాలంటే.

కోతకు ఒక వారం రోజుల ముందు మొక్క యొక్క ఆకులతో క్యాలీఫ్లవర్ పువ్వు కప్పి ఉంచాలి.ఇలా చేస్తే సూర్యరశ్మి నేరుగా పువ్వు పై పడదు కాబట్టి పువ్వు తెల్లగా ఉంటుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మీ అభిమానం తగలెయ్య.. ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత?

దీంతో క్యాలీఫ్లవర్ పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు