వీడియో: అయ్యో పాపం, ఉక్రెయిన్‌లో రాళ్లలో చిక్కుకుపోయిన పిల్లి... చివరికి..?

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రకటించి నేటికీ 23 రోజులు పూర్తయింది.అయితే ఈ 23 రోజుల్లో ఉక్రెయిన్‌లో జరిగిన ఘోరాలు వర్ణణాతీతమైనది.

వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి.తాజాగా మరొక వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

దీనిని చూసిన నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ఈ వీడియోలో ఒక పిల్లి రాళ్లలో చిక్కుకుపోయింది.

నిజానికి అది రాళ్ళల్లో సగం వరకు కూరుకుపోయి బయటకు రాలేక నరకయాతన అనుభవించింది.అయితే దీనిని గమనించిన రెస్క్యూ టీం దానిని చాలా సురక్షితంగా బయటకు తీశారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఒక పిల్లిని కాపాడుతున్న దృశ్యం గమనించవచ్చు.ఖర్కీవ్‌ నగరంలో ఒక మిస్సైల్ దాడి వల్ల భవనాలన్నీ కుప్పకూలాయి.

ఆ భవనాల శిథిలాల కింద ఒక పిల్లి కూరుకుపోయింది.అది చాలా దయనీయ స్థితిలో అరుస్తూ బయటపడేందుకు కొట్టుమిట్టాడుతోంది.

అయితే ఇది గమనించిన రెస్క్యూ సిబ్బంది మెల్లగా రాళ్ళు, రప్పలు పక్కకు తీసేసి పిల్లిని బయటికి తీశారు.అనంతరం ఒక మహిళ ఆ పిల్లిని పెంచుకునేందుకు ముందుకొచ్చింది.

దీంతో ఆ పిల్లి కథ సుఖాంతం అయ్యింది.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఈ పిల్లి అసలైన యజమానులు రష్యా బాంబుల దాడిలో మరణించారని రెస్క్యూ సిబ్బంది తెలిపింది.పిల్లిని కాపాడుతున్న వీడియోని రెస్క్యూ టీం తన ఫేస్‌బుక్ హ్యాండిల్ లో షేర్ చేస్తుంది.దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

Advertisement

దీన్ని చూసిన నెటిజన్లు బాగా భావోద్వేగానికి గురి అవుతున్నారు.అయ్యో పాపం, ఇంకా ఎన్ని మూగ జంతువులు బాంబుల దాడి వల్ల ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాయో అని బాధను వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు