బార్బీ డాల్స్‌ను తెగ ఇష్టపడుతున్న పిల్లి.. క్యూట్ వీడియో వైరల్..

కొంతమందికి చిన్నతనంలో బార్బీ బొమ్మలతో( Barbie Dolls ) ఆడుకోవడం ఇష్టం, మరికొందరు వాటిని సేకరిస్తారు.ముఖ్యంగా అమ్మాయిలకు బార్బీ డాల్స్ అంటే బాగా ఇష్టముంటుంది.

కొంతమంది యువతులు బార్బీ డాల్ గా కనిపించాలని సర్జరీలు కూడా చేయించుకుంటారు.బార్బీ చాలా క్యూట్ గా ఉంటుందని, ఆమె లాగా కనిపించాలని మగువలు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

బార్బీ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.దీన్నిబట్టి మనుషులకు బార్బీ అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

అయితే కొన్ని జంతువులు కూడా వాటిని ఇష్టపడతాయని మీకు తెలుసా? తాజాగా ఓ పిల్లి( Cat ) రెండు బార్బీ బొమ్మలను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్లైన్లో బాగా పాపులర్ అయింది.ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.

Advertisement

క్యాట్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్( Cats of Instagram ) అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయింది.పిల్లి పేరు పౌపీ అని, అది బార్బీని ప్రేమిస్తుందని క్యాప్షన్ చెబుతోంది.పౌపీ ఎలా ఆప్యాయంగా ఆ బొమ్మలను కౌగిలించుకుంటుందో, ముద్దులు పెడుతోందో( Cat Kissing barbie ) వీడియోలో కనిపించింది.ఈ వీడియో సెప్టెంబర్ 25న షేర్ చేయబడింది.17 లక్షలకు పైగా దీనికి వ్యూస్ వచ్చాయి.దీనికి అనేక లైక్లు, కామెంట్లు కూడా ఉన్నాయి.

"ఇది ఎంత ముద్దుగా ఉందో!" అని నెటిజెన్ కామెంట్ చేశారు.ఈ వీడియో చూస్తే నవ్వొస్తుందని మరి కొంతమంది కామెంట్లు చేశారు."ఈ పిల్లి టేస్ట్ మనుషుల్లాగానే ఉందేంటి, ఇది చూసేందుకు అద్భుతంగా ఉంద"ని మరి కొంతమంది వ్యాఖ్యానించారు.

చాలా మంది వీడియో( Viral Video )పై తమ ప్రేమను చూపించడానికి హార్ట్ ఎమోజీలను కూడా ఉపయోగించారు.బార్బీ బొమ్మలతో పిల్లి ఆడుకుంటున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇజ్రాయెలీ మ్యూజియంలో పురాతన కూజాను పగలగొట్టిన బాలుడు, వారిచ్చిన ట్విస్ట్‌తో..?
Advertisement

తాజా వార్తలు