తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో రచ్చ.. దాని గురించి తెలుసుకోవాల్సిన వివరాలివే..

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాసినో పేరు బాగా వినిపిస్తోంది.క్యాసినో అంటే ఏంటా అని ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు.

క్యాసినో అంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు.దీని అర్థం డబ్బు కోసం గేమ్స్ ఆడేందుకు వేదికగా మారే ఒక ప్లేస్ అని! పేరుకి గేమ్స్ అంటారు కానీ క్యాసినోలలో ఆడే ఆటలలో గ్యాంబ్లింగ్ జరుగుతుంది.

ప్రజలు ఈ గేమ్స్‌ను కేవలం డబ్బుల కోసమే ఆడతారు.వీటికి ఎలాంటి స్కిల్ అవసరం లేదు.

చీకట్లో బాణం వేసినట్లే ఉంటుంది.అదృష్ట నవరించకపోతే డబ్బులు పోతాయి.

Advertisement

ఉదాహరణకి ఫలానా బ్యాట్స్‌మేన్ సెంచరీ కొడతాడని బెట్ కట్టడం.ఈ బెట్ మన వైపు అనుకూలంగా ఉంటే డబ్బులు వస్తాయి.

లేదంటే బెట్ పెట్టిన డబ్బులన్నీ పోతాయి.దీన్నే సాధారణ పదాల్లో గ్యాంబ్లింగ్ అంటారు.

అందుకే క్యాసినో ఒక స్కిల్ బేస్డ్ గేమ్ కాదని అదొక గ్యాంబ్లింగ్ అని అంటారు.

క్యాసినోలో ఏం చేయొచ్చు?

క్యాసినోలలో పందెం కాయడానికి చాలా గ్యాంబ్లింగ్ గేమ్స్ అందుబాటులో ఉంటాయి.అలానే బెట్టింగ్, లాటరీ గేమ్స్ ఆడే మెషీన్లు కూడా అందుబాటులో ఉంచుతారు.

ఈ క్యాసినోలో పోకర్, బ్లాక్‌జాక్, రూలెట్, తీన్‌పత్తి వంటి ఆటలు ఉంటాయి.ఈ ఆటల్లో నచ్చిందాన్ని సెలెక్ట్ చేసుకొని డబ్బులు బెట్టింగ్ చేసి సంపాదించవచ్చు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!

లేదంటే డబ్బులు పోగొట్టుకోవచ్చు.క్యాసినోలకు వెళ్లే వారిలో చాలామంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే వెళ్తారు.

Advertisement

కొందరు మాత్రం వినోదం కోసం క్యాసినోలకు వెళ్తుంటారు.కొంతమంది ఈ ప్రదేశాలకు బానిసలవుతున్నారు.

ఈ క్యాసినోలకు వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేయడానికి పాటల కచేరీలు, పోల్ డ్యాన్స్, డ్యాన్స్ షో వంటివి నిర్వహిస్తారు.ఇక మందుకు కొదవే ఉండదు.

మసాజ్ సెంటర్లు కూడా ఇక్కడ వెలుస్తుంటాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్యాసినోలు పెట్టే అవకాశం ఉందా?

క్యాసినో అనేది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అని ముందే చెప్పుకున్నాం.అయితే వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే బ్యాన్ చేశాయి.అందువల్ల ప్రస్తుతానికి క్యాసినోలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.

ఈ కారణంగానే తెలుగు వాళ్లు గోవా లేదా నేపాల్, శ్రీలంక వంటి దేశాలకు వెళ్తుంటారు.ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి.

వీటిపై పెద్ద చర్చ కూడా జరిగింది.అలానే నిషిద్ధమైన వీటిని పెట్టినందుకు ఒక కాంట్రవర్సీ కూడా చెలరేగింది.