ప్రముఖ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానాలపై కేసు నమోదు..!

సినీ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానాల( Daggubati Venkatesh,Rana )పై కేసు నమోదు అయింది.

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై బాధితుడు నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం( Nampally Court ) దగ్గుబాటి వెంకటేశ్, రానాతో పాట దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఐపీసీ 448, 452, 380, 506, 120 బీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్( Demolition Of Deccan Kitchen ) కూల్చివేతకు పాల్పడిందని బాధితుడు నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.లీజు విషయంలో తనకు న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని తెలిపారు.ఈ కారణంగా తనకు సుమారు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు