ఏపీ సీఎంపై దాడి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు నిందితుడు సతీశ్( Satish ) బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

విచారణలో భాగంగా నిందితుడు సతీశ్ తరపున న్యాయవాది సలీం కోర్టులో వాదనలు వినిపించారు.ఇరు పక్షాల వాదనలు పూర్తయిన అనంతరం ఎనిమిదవ అదనపు జిల్లా కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

Case Of Attack On AP CM Reserve The Judgment On The Bail Petition Of The Accused

కాగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని( Vijayawada ) దాబాకొట్ల సెంటర్ వద్ద రోడ్ షో నిర్వహిస్తుండగా.సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో సీఎం జగన్ కు స్వల్ప గాయమైంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు