పొట్ట కొవ్వును కరిగించే క్యారెట్.. ఎలా తీసుకోవాలంటే?

సాధారణంగా కొందరికి పొట్ట వద్ద చాలా లావుగా ఉంటుంది.

ఆహారపు అలవాట్లు, మద్యపానం, గంటల తరబడి కూర్చుని ఉండటం తదితర కారణాల వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.

దాంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బాన పొట్టల తయారవుతుంది.దాంతో బెల్లీ ఫ్యాట్ సమస్యను దూరం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే పొట్ట కొవ్వును కరిగించేందుకు క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది.క్యారెట్లు తక్కువ ధరకే లభించినా.

వాటిలో బోలెడన్ని పోషక విలువలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అపార‌మైన‌ ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Advertisement

అలాగే పొట్ట కొవ్వును కరిగించేందుకు సైతం క్యారెట్లు ఉపయోగపడతాయి.అందుకోసం ఒక పెద్ద క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే చిటికెడు బ్లాక్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో క్యారెట్ జ్యూస్ ను స‌ప‌రేట్‌ చేసుకోవాలి.

ఈ క్యారెట్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా మిక్స్ చేసి సేవించాలి.ఈ క్యారెట్ జ్యూస్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున ప్రతి రోజు తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.పొట్ట‌ నాజుగ్గా మారుతుంది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

అంతేకాదు ఈ క్యారెక్ట్‌ జ్యూస్ ను తీసుకోవడం వల్ల చర్మం నిగారింపుగా, యవ్వనంగా మారుతుంది.

Advertisement

వృద్ధాప్య లక్షణాలు త్వరగా ద‌రి చేరకుండా ఉంటాయి.జుట్టు రాలడం, పొట్లి పోవడం వంటివి తగ్గుతాయి.అలాగే ఈ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.

దాంతో సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు