చర్మ సంరక్షణలో క్యారెట్ ఫేస్ ప్యాక్స్..

క్యారెట్ లో బీటా- కెరోటిన్, ఖనిజలవణాలు, ఇతర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా చర్మ సౌందర్యంలోనూ కీలకమైన పాత్రను పోషిస్తాయి.

చర్మానికి సంబంధించి అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది.వాటి కోసం క్యారెట్ ని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

క్యారెట్ తురుముతో తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని తడి టవల్ తో తుడుచుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మృదువుగా మారిపోతుంది.

రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ కీరా దోశ పేస్ట్, ఒక పుల్లని పెరుగు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత సాధారణమైన నీటితో కడగాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement

ఇది యాంటీ ఏజింగ్ మాస్క్ గా ఉపయోగపడుతుంది.

రెండు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ మజ్జిగ, మూడు స్పూన్ల క్యారెట్ జ్యుస్, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన చర్మంపై జిడ్డు తొలగిపోతుంది.ఒక స్పూన్ క్యారెట్ జ్యుస్ లో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన, ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక చాలాల్ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయటం వలన ముఖం మీద ట్యాన్ తొలగిపోతుంది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు