దేశ ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులను కూడా అస్తవ్యస్తం చేసి ప్రజలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోలేదు అన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ దిశగా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్రం హెచ్చరిక లేఖలను పంపించినట్లుగా తెలుస్తుంది.
కరోనా( Corona ) మహమ్మారి ప్రభావం ముగిసి పోలేదని అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక చేసింది.మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని ఇది ఐదు శాతాన్ని దాటినందున తేలికగా తీసుకోకూడదని ఇప్పుడు దేశవ్యాప్తంగా 60 వేల కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.
మార్చి నెల నుండి ఇప్పటివరకు రోజువారి కేసుల సంఖ్య నిలకడగా 10000 దాటుతుందని ఇది ఆందోళన చెందాల్సిన అంశం అంటూ ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) వివరించి నట్టుగా తెలుస్తుంది.
మాస్కులను తప్పనిసరి చేయాలని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో( primary health centres )నూ సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన పెంచేలా ప్రచారం చేయాలని.పరిస్థితి అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు డేటాను సక్రమంగా మైంటైన్ చేసుకుంటూ సరైన చర్యలు తీసుకోవాలని.కేంద్ర వైద్య శాఖ( Central Medical Department )తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పలు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది.
ప్రారంభ దశలోనే గుర్తుపట్టేలా సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలని ఒక యాక్షన్ ప్లాన్ తో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది.
కరోనా చేసిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ముందుకు వెళుతున్న ప్రజలకు అది పూర్తిగా మాయమైపోలేదని వస్తున్న వార్తలు ఆందోళన గురిచేస్తున్నాయి .ఈ కరోనా కరాల నృత్యం దాటికి కుటుంబ సభ్యులను బంధువులను ఆస్తులు పోగొట్టుకున్నప్రజల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉంది.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాని తదనంతర పర్యవసనాలు తో ఇప్పటికే చాలామంది అవస్థలు పడుతున్నారు.
చాలామందికి అవయవాలు పనితీరు మందగించిన విషయం కూడా తెలిసిందే .ఇటీవల చాలా గుండెపోటు మరణాలకు కరోనా తదనంతర పరిస్థితిలే కారణమని డాక్టర్లు నిర్ధారించిన విషయం కూడా మనం పేపర్లో చూసాం .మరి ఎప్పటికీ ఈ మహమ్మారి నుండి ప్రపంచం మానవాళి పూర్తిగా కోరుకుంటుందో ఆ బహుశా భగవంతుడికే తెలియాలి .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy