యాలకులతో ఇలా చేస్తే హెయిర్ ఫాల్ త‌గ్గుతుంద‌ట‌.. తెలుసా?

యాల‌కులు.రుచిక‌ర‌మైన‌వే కాదు ఎంతో ఖ‌రీదైన‌వి కూడా.

అలాగే యాల‌కుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్‌, విట‌మిన్ బి, విట‌మిన్ సి, ప్రోటీన్‌తో స‌హా శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.అందుకే యాల‌కులు ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు సైతం యాల‌కులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అవును, ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా యాల‌కుల‌ను యూజ్ చేస్తే.

హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు సుల‌భంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

Advertisement

ముందుగా ప‌ది నుంచి ప‌దిహేను యాల‌కుల‌ను తీసుకుని క‌చ్చా ప‌చ్చాగా దంచుకోవాలి.అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క‌, ఎనిమిది మిరియాలు తీసుకుని మెత్త‌గా పొడి చేయాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని క‌ప్పు కొబ్బ‌రి నూనె, అర కప్పు బాదం నూనె వేయాలి.నూనె హీట్ అవ్వ‌గానే అందులో దంచుకున్న యాల‌కులు, పొడి చేసి పెట్టుకున్న మిరియాలు దాల్చిన చెక్క వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి.నూనెను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.బాగా చ‌ల్లారిన అనంత‌రం ఆ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రపోయే ముందు ఇలా చేసి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేస్తే గ‌నుక యాల‌కుల్లో ఉండే ప్ర‌త్యేక‌మైన సుగుణాలు హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను క్ర‌మంగా త‌గ్గించేస్తాయి.

How Modern Technology Shapes The IGaming Experience
రాష్ట్రంలో కొత్తగా 1,506 కరోనా కేసులు..

అంతేకాదండోయ్‌.హెయిర్ స్ట్రోంగ్‌గా పెరుగుతుంది.

Advertisement

డ్రై హెయిర్ స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.అలాగే వైట్ హెయిర్ స‌మ‌స్య త్వ‌ర‌గా రాకుండా కూడా ఉంటుంది.

తాజా వార్తలు