టీడీపీ సింగిల్‎గా పోటీ చేయొచ్చు కదా.?: బాలినేని

నకిలీ స్టాంపులు, భూ కబ్జాల విషయంలో దర్యాప్తు కోసం సిట్ వేశామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు.

ఈ మేరకు సిట్ రిపోర్ట్ కూడా రెడీ అవుతోందని తెలిపారు.

ఈ క్రమంలోనే నిందితులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి బాలినేని పేర్కొన్నారు.టీడీపీ సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.

పొత్తు లేకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి టీడీపీదని విమర్శించారు.చంద్రబాబు విషయంలో టీడీపీ నేతలు నానా యాగి చేస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబును ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదని వెల్లడించారు.

Advertisement
చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

తాజా వార్తలు