నెలాఖరులో ఫెడరల్ ఎన్నికలు .. హిందూ ఆలయాన్ని సందర్శించిన కెనడా ప్రధాని

నిన్నటి వరకు కొత్త ప్రధాని ఎంపికతో కెనడాలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.ఇంతలోనే కెనడా ఎన్నికలకు( Canadian elections ) సిద్ధమైంది.

త్వరలోనే అక్కడ ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకోసం లిబరల్స్, కన్జర్వేటివ్స్, చిన్నా చితకా పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని టొరంటోలోని బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ మందిర్‌ను ( BAPS Sri Swami Narayana Mandir )సందర్శించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.ఈ సంఘటన కెనడా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

దేశంలోని విభిన్న వర్గాలతో సన్నిహితంగా ఉండటానికి మార్క్ కార్నీ చేసిన ప్రయత్నాలను ఇది హైలైట్ చేసింది.ఓటర్లతో సంబంధాలను పెంచుకోవడంలో ఇది ముఖ్యమైన చర్య అని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

అయితే కెనడాలో గత కొద్దినెలలుగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపైనా చర్చ జరుగుతోంది.హిందూ కెనడియన్ ఫౌండేషన్ ( Hindu Canadian Foundation )చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం విస్మరిస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి.

కెనడాలో దాదాపు 10 లక్షల మందికిపైగా హిందువులు ఉండటంతో ఈ ఆందోళనలు చాలా ముఖ్యమైనవిగా అభివర్ణిస్తున్నారు.హిందూ కెనడియన్లు కెనడా సమాజంలో కలిసిపోయినప్పటికీ.

రాజకీయంగా మాత్రం దూరంగానే ఉన్నారు.

ఈ నెల 28న కెనడాలో ఫెడరల్ ఎన్నికలు( Federal elections ) జరగున్నాయి.ప్రతి ఐదేళ్లకొకసారి కెనడాలో ఎన్నికలు జరగాల్సి ఉంది.దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 20న ఫెడరల్ ఎన్నికలు జరగాలి.

కానీ కొన్ని కారణాలతో ఎన్నికలు ఈసారి ముందే వస్తున్నాయి.ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సింది ప్రధాని చేసిన సిఫారసును గవర్నర్ జనరల్ ఆమోదించడం లేదా విశ్వాస పరీక్షలో ఓడిపోయిన తర్వాత ప్రధాని రాజీనామా చేస్తే ఎన్నికలు ముందే రావడానికి కెనడా రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉంది.

Advertisement

యూకే సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే కెనడాలోనూ ఓటర్లు నేరుగా తమ ఓటును ప్రధానికి వేయరు.మొత్తం పార్లమెంట్ సభ్యులలో మెజారిటీ ఉన్న నాయకుడు ప్రధాన మంత్రి అవుతారు.దీనిని బట్టి ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ.

కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రే, న్యూడెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్‌లు పోటీలో ఉంటారని అర్ధం.ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలు పోటీ చేస్తాయి - అవి లిబరల్స్, కన్జర్వేటివ్స్, న్యూ డెమోక్రాట్స్ , బ్లాక్ క్యూబెకోయిస్.2015లో జస్టిన్ ట్రూడో అధికారంలోకి వచ్చి నాటి నుంచి లిబరల్ పార్టీయే కెనడాను ఏలుతూ వస్తోంది.

తాజా వార్తలు