ఆకాశంలో ఏలియన్స్.. గుర్తించిన కెనడియన్ కపుల్..??

కెనడాకు చెందిన జస్టిన్ స్టీవెన్సన్( Justin Stevenson ), ఆయన భార్య డానియెల్లే డేనియల్స్-స్టీవెన్సన్‌లు( Danielle Daniels-Stevensons ) మే 14వ తేదీ రాత్రి ఫోర్ట్ అలెగ్జాండర్ గుండా వెళ్తుండగా ఆశ్చర్యపరిచే దృశ్యాన్ని చూశారు.

వారు వింనిపెగ్ నది పైన మెరుస్తున్న రెండు ప్రకాశవంతమైన వస్తువులను గుర్తించారు.

ఆ వస్తువులు ఎండలానే చాలా బ్రహ్మండంగా వెలుగుతున్నాయి.అవి నది ఉత్తర తీరం పైన దక్షిణం వైపుకు వెళ్లగానే మేఘాల వెనుక దాచేసుకున్నాయి.

గతంలో గ్రహాంతర ఉనికిని నమ్మని స్టీవెన్సన్, ఈ అనుభవాన్ని అత్యద్భుతంగా ఉందని అభివర్ణించారు.అవి సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా ఉందని ఆయన అన్నారు.

ఆ వస్తువులు ఆకాశంలో మంటలా వెలుగుతున్నాయని ఆయన వర్ణించారు.ఆయన ఈ సంఘటనను వీడియో తీశారు.

Advertisement

అవి ఏలియన్ల వాహనాలు కావచ్చని ఊహించారు.

ఈ వస్తువులు చాలా వేగంగా కదులుతూ, చాలా ఎత్తులో ఉన్నాయి.వస్తువులు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో స్టీవెన్సన్ సూర్యునితో పోల్చాడు.వస్తువులు మేఘాల వెనుకకు అదృశ్యమయ్యే ముందు, దక్షిణం వైపుకు వెళ్లాయని ఈ అనుభవం ఆశ్చర్యపరిచిందని స్టీవెన్సన్‌ అన్నారు.

ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, చాలా చర్చలకు దారితీసింది.కొంతమంది వీడియోలోని వస్తువులు UFOలు అని నమ్ముతారు, మరికొందరు అవి డ్రోన్‌లు లేదా ఇతర విమానాలు అని పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాలలో కెనడాలో UFO దృశ్యాల( UFO sightings in Canada ) సంఖ్య పెరుగుతోంది.2023లో, కనీసం 17 UFO సైటింగ్స్ రిపోర్ట్ అయ్యాయి.ఈ సైటింగ్స్‌ను చాలా వరకు విమానయాన సంస్థల సిబ్బంది నివేదించింది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అయితే వారి చూసినవి ఏంటనేవి ఎవరూ ఇంకా నిర్ధారించలేకపోయారు.ఈ లింకు https://www.facebook.com/share/v/hsUrYCrAkEGhwFNg/?mibextid=xfxF2iపై క్లిక్ చేసి ఆ వీడియోను చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు