శుభకార్యాలలో నవధాన్యాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా?

సాధారణంగా నవ ధాన్యాలను నవ గ్రహాలకు సంకేతంగా భావిస్తారు.తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ధాన్యాలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.

సూర్యుడికి గోధుమలు .చంద్రుడికి బియ్యము.కుజ గ్రహానికి కందులు.

బుధ గ్రహానికి పెసలు.గురు గ్రహానికి సెనగలు.

శుక్ర గ్రహానికి బొబ్బర్లు.శని గ్రహానికి నువ్వులు.

Advertisement

రాహుగ్రహానికి మినుములు.కేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.

ఈ నవ ధాన్యాలను దైవ కార్యాలలోను శుభకార్యాలలోను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.ముఖ్యంగా వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పోసి ఉంచుతారు.

అవి బాగా మొలకలు వస్తే వారి సంసారం చాలా అన్యోన్యంగా సాగుతుందని భావిస్తారు.అంతేకాకుండా వారిపై నవగ్రహాల అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.

నూతన వధూవరులిద్దరూ ఇటు నవగ్రహాలను.వాటితో అనుసంధానించబడిన ధాన్యాల అనుగ్రహాన్ని పొందడమే ఉద్దేశంగా ఈ తంతు కొనసాగుతుందని చెప్పవచ్చు.

మహిళలు మర్రి చెట్టుకు పూజలు చేయడం వల్ల.. సంతాన సమస్యలతో పాటు మరెన్నో సమస్యలు దూరం..!

నవధాన్యాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.ఒక్కో ధాన్యంలో ఒక్కో గుణం ఉంది.

Advertisement

నవ ధాన్యాలను తీసుకోవటం వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.జీవితంలో అన్ని రకాల మనస్తత్వాలను సమన్వయ పరుచుకోవాలనే ఉద్దేశాన్ని నవ ధాన్యాలు తెలుపుతాయి.

తాజా వార్తలు