రానున్న రోజుల్లో బిగ్ బజార్ పేరును ఇక వినమేమో..??

రిలయన్స్ కంపనీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.చాలాచోట్ల రిలయన్స్ పేరుతో ఎన్నో రకాల షోరూమ్స్ ను మనం చూసే ఉంటాము.

అయితే ఇప్పటివరకు మనం విన్న బిగ్ బజారు యొక్క పేరును మార్చేసి బ్రాండ్ స్మార్ట్ బజార్‌ అనే పేరుతో తిరిగి ప్రారంభించబోతోంది.వివరాల్లోకి వెళితే.

ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ అవుట్‌లెట్ల పేరును ఇకనుండి బ్రాండ్ స్మార్ట్ బజార్‌గా మార్చాలని అనుకుంటుంది.ప్రముఖ వార్త పత్రిక నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం దాదాపు 950 ప్రాపర్టీలలో తన సొంత స్టోర్లను ఓపెన్ చేయడానికి చూస్తుందని ఇద్దరు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు.

అంటే కొన్ని స్మార్ట్ బజార్ స్టోర్‌లతో సహా కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా కనీసం100 స్టోర్‌లను తెరవాలని కంపెనీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.అంతేకాకుండా మార్చ్ నెలలోనే వీటిని ప్రారంభించనున్నట్లు కూడా తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ విషయం గురించి ఇంకా రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ ఇంకా స్పందించలేదు.రిలయన్స్ రిటైల్ ప్రస్తుత స్మార్ట్ సూపర్ మార్కెట్‌ల కంటే స్మార్ట్ బజార్ ఇకనుండి రోజువారీ దుస్తులు, సాధారణ వస్తువులపై ఎక్కువగా దృష్టిసారిస్తుందని అధికారులు తెలిపారు.

అలాగే వీటిని కూడా బిగ్ బజార్ తరహాలోనే రూపొందించనున్నారు.ఇప్పటికే సెంట్రల్ వంటి పెద్ద ఫ్యూచర్ గ్రూప్ స్టోర్‌లు ఉన్నాయి.

ఇవి 60,000 చదరపు అడుగుల నుంచి 100,000 చదరపు అడుగుల వరకు విస్తరించి ఉన్నాయి.ఇక్కడ రిలయన్స్ మాల్ వంటి దాని ప్రస్తుత బ్రాండ్లను తీసుకువస్తుంది.

అంటే రానున్న రోజుల్లో బిగ్ బజారు పేరు బహుశా మనకు వినిపించకపోవచ్చు.ఇప్పటికన్నా మరిన్ని ఐటమ్స్ తో మనముందుకు రానుంది బ్రాండ్ స్మార్ట్ బజార్.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement