అండు కొర్రలతో ఇన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చా..?

ముఖ్యంగా చెప్పాలంటే పూర్వం రోజులలోనీ ప్రజలు కొర్ర బియ్యం తినేవారు.అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.

అండు కొర్రలు అనే పేరు ఈ మధ్యనే మనం వింటూ ఉన్నాము.అసలు అండు కొర్రలు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మానవాళికి అద్భుతమైన ప్రయోజలను అందించేవి ఐదు సిరి ధాన్యాలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.వీటిలో మొదటి స్థానంలో అండు కొర్రలు ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ఒక్క అండు కొర్రలలో ( Andu Korralu )12.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.ఇది రక్తంలో గ్లూకోస్ ను నియంత్రణలో ఉంచి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా చెడు కొలెస్ట్రాలను తగ్గించి ఫైబర్ అధిక బరువును( Overweight ) కూడా తగ్గిస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఫైబర్ దీనిలో అధిక మొత్తంలో ఉంటుంది.

Advertisement

కాబట్టి అండు కొర్రలను గొప్ప ధాన్యాలు అని అంటారు.ఇందులో ఫైబర్ మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఫైబర్ తో పాటు ఈ విటమిన్స్ పుష్కలంగా ఉండడం వల్ల గుండె జబ్బులు( Heart diseases ) రాకుండా ఉంటాయి.ఈ అండు కొర్రలు తినేవారిలో గుండె జబ్బు సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ఈ అండు కొర్రలు తినే వారు డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు.ఈ అండు కొర్రలలో జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ( Blood Pressure ), థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం లాంటి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి.అంతే కాకుండా మొలలు, అల్సర్లు, మెదడు, ఎముకల, ఊదర, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సలో కూడా ఇవి ఉపయోగపడతాయి.

వీటిని ఏ జబ్బు లేని వారు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.ఏదైనా వ్యాధి నివారణ కోసం ఉపయోగించినట్లయితే వైద్యుల సలహాను తీసుకుని ఉపయోగించడం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే వీటిని కచ్చితంగా నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఉపయోగిస్తే వీటి పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు