కొత్త జిల్లాలతో జ‌గ‌న్‌కు తిప్ప‌లు త‌ప్ప‌వా.. డిమాండ్లు ఇంకా పెర‌గ‌నున్నాయా..?

ఏపీ సర్కారు 13 జిల్లాలను ప్రకటించి నోటిఫికేషన్ విడుడల చేసిన సంగతి తెలిసిందే.కాగా, ఆ అంశం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమవుతున్నది.

పరిపాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెప్తోంది.జిల్లాల ఏర్పాటును అందరూ స్వాగతిస్తున్నారు.

కానీ, జిల్లాల ఏర్పాటు వలన ఏపీ సర్కారుపై భారం పడుతుందని కొందరు అంటున్నారు.అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజధాని లేని రాష్ట్రానికి ఇప్పుడు జిల్లాల ఏర్పాటుతో ఇంకా నిధులు అవసరం పడతాయని వివరిస్తున్నారు.

జిల్లా కేంద్రం ఏర్పాటు కావాలంలే చాలా పనులు జరగాల్సి ఉంటుంది.భవనాలు, మౌలిక సదుపాయాలు, కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగుల విభజన,కార్యాలయాలు ఇలా రకరకాల అవసరాలుంటాయి.

Advertisement
Can Jagan Will Face Issues After Announcing New Districts In Ap Details, Jagan,

ఈ నేపథ్యంలో వీటన్నిటిని ఏర్పాటు చేస్తే సర్కారుపైన ఇంకా ఆర్థిక భారం పడుతుంది.ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు టైంకు అందడం లేదనే ఆరోపణలు ఉండగా, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనమేంటనే వాదన ఉంది.

అయితే, గతంలోనే అనగా ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది.కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నందున ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

అయితే, వైసీపీ సర్కారు మాత్రం అలా చేయలేదు.ఏకంగా సీనియర్ ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటు చేసి చంద్రబాబుకు చెక్ పెట్టినంత పని చేసింది.

Can Jagan Will Face Issues After Announcing New Districts In Ap Details, Jagan,

ఇకపోతే ఎన్టీఆర్ పేరిట డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడాన్ని ఎన్టీఆర్ తనయ పురంధేశ్వరి, తనయుడు రామకృష్ణ స్వాగతించారు.కొందరు సినీ ప్రముఖులు కూడా వైసీపీ సర్కారు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నారు.అయితే, ఇంకొన్ని ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరమీదకు రావచ్చు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇప్పటికే బాలకృష్ణ నందమూరి .హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.చూడాలి మరి.భవిష్యత్తుల్లో ఇంకెన్ని డిమాండ్స్ వస్తాయో.వాటిని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో.

Advertisement
" autoplay>

తాజా వార్తలు