ఈ ఆకులతో ఏడు రోజుల్లో డయాబెటిస్ తగ్గుతుందా..

ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలకు డయాబెటిస్ వ్యాధి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది.

ఈ వ్యాధి వల్ల చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ఈ వ్యాధి చాలామందిలో రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, గుండెపోటు సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి ఇంతకుముందు నుంచి మధుమొహంతో బాధపడుతున్న వారు తప్పకుండా వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచడం మంచిది.

వీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటేనే శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉండి రక్తంలోని షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.లేకపోతే ఈ వ్యాధి ఉన్నవారు తీవ్ర అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఈ క్రింది నియమాలను పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి.రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడంలో కరివేపాకు ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది.

Advertisement

కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఆహారంలో తప్పకుండా కరివేపాకును ఉపయోగించడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే చాలామంది మెంతి ఆకులను కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

ఇందులో ఉండే గుణాలు సులభంగా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి.

కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఈ ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉండడం మంచిది.అంతేకాకుండా మామిడి ఆకులు కూడా శరీరానికి ఎంతో మంచిని చేస్తాయి.ఈ ఆకును టీలా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.

రక్తంలోని చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వేపాకును మన తెలంగాణలోని పల్లె ప్రాంతాల్లో చాలామంది ప్రజలు వినియోగిస్తారు.ఈ ఆకులను ఎక్కువగా చర్మ అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ ఆకులను పొడి చేసి ఆ తర్వాత ఆ పొడిని ప్రతిరోజు నీటిలో కలుపుకొని తాగితే రక్తంలోని చక్కెర సులభంగా నియంత్రణలో ఉంటుంది.అంతేకాకుండా డయాబెటిస్ నిదానంగా దూరమయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు