రేపు చలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..!

రేపు అంగన్వాడీ కార్యకర్తలు( Anganwadi Leaders ) చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు సుమారు లక్ష మందితో విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

అయితే సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే.అలాగే గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!