ఆ ఇద్దరికీ క్యాబినెట్ హోదా ! అవసరమా అంటూ జగన్ పై విమర్శలు ?

ఏ విషయంలోనూ విమర్శలపాలవ్వకుండా జగన్ జాగ్రత్తపడుతూ ఉంటారు.

అలాగే సామాజిక వర్గాల లెక్కలను జాగ్రత్తగా వేసుకొని ఆచితూచి మరి జగన్ ఏపీలో పార్టీ, ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారు.

ఇప్పటికే ఏపీలో మంత్రులుగా ఉన్న వారి వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.గత మంత్రివర్గంలోనూ ఇదే రకమైన ఫార్ములాను జగన్ ఉపయోగించారు.

జగన్ పాటించిన ఈ విధానంపై విమర్శలు లేకపోగా ప్రశంసలు పార్టీలకతీతంగా వ్యక్తమయ్యాయి.ఇదిలా ఉంటే కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలోనూ, వారికి కల్పిస్తున్న హోదా, సౌకర్యాల విషయంలో జగన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే 70 మంది తనకు అత్యంత సన్నిహితులైన వారిని ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు.వీరికి ప్రతి నెల లక్షలాది రూపాయల జీతాలను ఇవ్వడంతో పాటు, ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.

Advertisement
Cabint Status On Apsrtc Chirman And Vice Chirman , Ap Cm, Ap Cm Jagan, Jagan, Ys

తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, వైస్ చైర్మన్ / డైరెక్టర్ విజయానంద రెడ్డి లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వీరిద్దరికీ మంత్రుల స్థాయిలోనే క్యాబినెట్ హోదా కల్పించి లక్షలాది రూపాయలు సౌకర్యాలు కల్పించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Cabint Status On Apsrtc Chirman And Vice Chirman , Ap Cm, Ap Cm Jagan, Jagan, Ys

ఆగస్టులో ఆర్టీసీ చైర్మన్ గా మల్లికార్జున్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.ఆ తరువాత విజయానంద రెడ్డి వైస్ చైర్మన్ గా డైరెక్టర్ గా నియమితులయ్యారు.ఇప్పుడు ఈ ఇద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించారు.

గతంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ( ఏపీఐఐసీ ) చైర్మన్ కు మాత్రమే కేబినెట్ హోదా ఉండేది.కానీ ఇప్పుడు ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్ కు  ఆ హోదా కట్టబెట్టడం విమర్శలకు కారణమవుతోంది.

ఇవే కాకుండా చాలా నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తుండడంతో జగన్ తీవ్ర విమర్శలపాలవుతున్నారు..

దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..
Advertisement

తాజా వార్తలు