క్రమం తప్పకుండా దొండకాయ తినడం వల్ల.. ఈ వ్యాధులకు గుడ్ బై చెప్పవచ్చు..!

సాధారణంగా చెప్పాలంటే తీగలా వ్యాపించే దొండ మొక్క మన భారతదేశంలోను, అలాగే ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

కాబట్టి ఇక్కడి ప్రజలు చాలా కాలం నుంచి అనేక ఆరోగ్య సమస్యలకు ( Health problems )మూలిక ఔషధంగా ఈ తీగ జాతి మొక్క ఆకులను, వేర్లను ఉపయోగిస్తున్నారు.

దొండ ఆకులు గుండె ఆకారంలో నుంచి మద్యస్థ పరిమాణంలో ఉంటాయి.దొండ మొక్కలు నాలుగు అంగుళాల కంటే తక్కువగా పెరుగుతాయి.

కానీ ప్రజలు దాన్ని అపారమైన సహజ ప్రయోజనాలను పొందుతున్నారు.దొండ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అజీర్ణం లేదా మలబద్ధకం( Constipation )తో బాధపడే వారికి దొండ చాలా చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది.ఇందులోని అధిక నీటి శాతం మరియు ఫైబర్ కంటెంట్ కారణంగా ఇది మానవ జీర్ణ క్రియ కు సంబంధించిన అనేక సమస్యలను సులభంగా దూరం చేస్తుంది.

Advertisement

ఇతర కూరగాయలతో పోలిస్తే దొండ చాలా ఆరోగ్యకరమైనదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే దొండ కాయ తినడం వల్ల మధుమేహం( Diabetes ) రాకుండా ఉంటుంది.

ఎందుకంటే మన పెద్దలు చాలా కాలం క్రితం నుంచి శరీరంలో చక్కెర స్థాయిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి దొండ కాయ వంటకాలను తినమని చెబుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద విధానంలో కూడా తీగల పండ్లకు మరియు ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.మధుమేహం ఇప్పటికే నియంత్రణలో లేని వ్యక్తులు దొండ రసం( Ivy Gourd juice ) తయారు చేసి ప్రతి రోజు తాగాలని వైద్యులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) మానవ శరీరాన్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.

ఇది శరీరంలోని కణాలకు మరియు డీఎన్ఏ మూలకాలకు నష్టం జరగకుండా చేస్తుంది.మానవ శరీరంలోని జీవ కణాల పరివర్తనను ఆపే శక్తిని కలిగి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే దురద, గజ్జి, కుష్టు వ్యాధి వంటి వివిధ సమస్యలకు వీటి ఆకులను ఔషధంగా ఉపయోగించవచ్చు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ప్రధానంగా మహిళలలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ( Bacterial infections )కు,అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్ గా పనిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు