ఆ సినిమా ఫ్లాప్ కావడానికి దిల్ రాజు కారణమా.. రచయిత సంచలన ఆరోపణలు!

రచయితగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బీవీఎస్ రవి దర్శకుడిగా మాత్రం సత్తా చాటలేకపోయారు.

డైరెక్షన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి డిజాస్టర్ గా నిలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బీవీఎస్ రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించడం గమనార్హం.తన డైరెక్షన్ లో తెరకెక్కిన జవాన్ సినిమా ఫ్లాప్ కు నిర్మాత దిల్ రాజు కారణమని ఆయన తెలిపారు.

నిర్మాత దిల్ రాజుకు ఫ్యామిలీ సినిమాల మీద పట్టు ఉందని అయితే ఆయనకు సరైన అనుభవం లేకపోవడంతో జవాన్ మూవీ రా అవుట్ పుట్ చూసి సరిగ్గా జడ్జ్ చేయలేకపోయారని బీవీఎస్ రవి అన్నారు.నిర్మాత దిల్ రాజు తన చిత్తానికి అ సినిమాను కెలికారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.

ధృవ సినిమాకు జవాన్ మూవీకి దగ్గరి పోలికలు ఉండటం యదృచ్ఛికంగా జరిగిందని కామెంట్లు చేశారు.

Bvs Ravi Sensational Comments About Dil Raju Details Here Goes Viral , Bvs Rav
Advertisement
Bvs Ravi Sensational Comments About Dil Raju Details Here Goes Viral , Bvs Rav

ధృవ కంటే ముందుగా జవాన్ ను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని సాయితేజ్ భావించారని ఫ్యామిలీ సంబంధాలు కీలకం అని సాయితేజ్ భావించడంతో ఆ సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగిందని బీవీఎస్ రవి పేర్కొన్నారు.ఆలస్యంగా సినిమాను విడుదల చేయడం కూడా జవాన్ మూవీకి మైనస్ అయిందని పేర్కొన్నారు.బీవీఎస్ రవి కామెంట్ల గురించి దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

Bvs Ravi Sensational Comments About Dil Raju Details Here Goes Viral , Bvs Rav

ఈ మధ్య కాలంలో దిల్ రాజు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.ఒకవేళ దిల్ రాజు జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే జవాన్ సినిమా హిట్టయ్యేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బీవీఎస్ రవి ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోతో బిజీగా ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు