లాస్ ఏంజిల్స్‌లో గొడవ.. లేడీ బస్సు డ్రైవర్‌పై భౌతిక దాడి..

లాస్ ఏంజిల్స్‌లోని( Los Angeles ) దక్షిణ ప్రాంతంలో ఓ బస్సు డ్రైవర్, ప్రయాణికురాలి మధ్య జరిగిన ఘర్షణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టికెట్ డబ్బుల విషయంలో వాదన మొదలై ఈ ఘర్షణకు దారి తీసిందని తెలుస్తోంది.

ఆ వీడియోలో ప్రయాణికురాలు బలవంతంగా డ్రైవర్‌ను సీటు నుంచి బయటకు లాగి దాడి చేస్తోంది.దానికి బదులుగా, డ్రైవర్ తన కాళ్లతో ఆమెను తన్నేసి ప్రతిఘటించడం కూడా కనిపిస్తోంది.

ఈ వీడియో చివరి వరకు ఈ ఘర్షణ కొనసాగుతోంది.ఫాక్స్ న్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేయగా, చాలా మంది దీనిని చూసి షాక్‌ అయ్యారు.

డ్రైవర్ గట్టిగా "నా దగ్గర నుంచి దూరంగా ఉండు!" అని అరుస్తున్న శబ్దం కూడా వీడియోలో ఉంది.దాడి జరిగినా, డ్రైవర్ తన కాళ్లతో ఆమెను తన్ని, బస్సు నుంచి దించేందుకు ప్రయత్నించింది.

Advertisement

వీడియో చుట్టూ ఉన్న క్యాప్షన్‌లో "బస్సు ఛార్జీలు ఉచితం అయినా డబ్బులు తీసుకోవాలని ప్యాసింజర్ డ్రైవర్ ను బలవంత పెట్టింది అయితే డ్రైవర్( Driver ) తీసుకొని అని చెప్పడంతో ప్రయాణికురాలు డ్రైవర్‌పై దాడి చేసింది" అని ఉంది.ఛార్జీలు ఉచితం అయి ఉండగా, డబ్బులు ఇస్తానని ప్రయాణికురాలు ఎందుకు డ్రైవర్‌తో గొడవ పడిందో ఈ వివరణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

వీడియో కింద కామెంట్స్ చేసిన వాళ్ళు, ఆ ప్రయాణికురాలి ప్రవర్తన సరికాదని, సహాయం చేయకుండా వీడియో తీసిన వాళ్లపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.బస్సు డ్రైవర్లు ప్రయాణికుల నుండి దాడులకు గురవుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి.గత 15 సంవత్సరాలలో రవాణా రంగానికి సంబంధించిన ఉద్యోగులపై దాడులు మూడు రెట్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇది చాలా తీవ్రమైన సమస్య అని తెలుస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు