టాలీవుడ్‌లో హృదయ కాలేయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఒకే ఒక్క సినిమాతో బర్నింగ్‌స్టార్ అయిపోయాడు.
ఆ సినిమా తర్వాత సంపూకు తెలుగులో వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు.
ఇక హృదయకాలేయం తర్వాత సంపూను వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.పెసరట్టు, సింగం 123 సినిమాలు చేసిన సంపూ తాజాగా వైరస్ సినిమాతో హీరోగా మరోసారి మన ముందుకు వచ్చాడు.
ఇక లేటెస్ట్‌గా సంపూర్ణేష్‌బాబు బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసి ఇప్పుడు అవుట్ అయ్యాడు.తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిద్ధిపేటకు చెందిన సంపూర్ణేష్ అడుగులు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ వైపు పడుతున్నట్టు తెలుస్తోంది.
బర్నింగ్‌స్టార్ వచ్చే ఎన్నికల వేళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది.సంపూకు సమకాలీన అంశాలపై మంచి అవగాహన ఉంది.
సంపూది తెలంగాణ అయినా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోను అభిమానులు ఉన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరిగిన సభకు సంపూ డేర్ చేసి వెళ్లిన తీరుతో ఆయన అందరి మనస్సులు గెలుచుకున్నారు.
ఇక సంపూ 2019 ఎన్నికల్లో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ తరపున తెలంగాణ నుంచి అసెంబ్లీ బరిలో ఉంటాడని వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సంపూర్ణేష్ సొంత నియోజకవర్గం సిద్ధిపేట.
ప్రస్తుతం అక్కడ నుంచి తెలంగాణ మంత్రి హరీష్‌రావు ప్రాథినిత్యం వహిస్తున్నారు.ఆయన మీద పోటీ చేసి గెలవడం అంటే కలలాంటిదే.
ఈ క్రమంలోనే సంపూ సిద్ధిపేట కాకుండా జనసేన ప్రభావం ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తే సెటిలర్ల ఓట్లు, పవన్ మానియా, అప్పటకి టీడీపీ+పవన్ కలిస్తే టీడీపీకి గ్రేటర్‌లో కాస్తో కూస్తో పట్టు ఉంది.
ఇవన్నీ కలిగలిస్తే తన గెలుపు సులువు అవుతుందని సంపూ ప్లాన్‌గా తెలుస్తోంది.మరి సంపూ పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇస్తే గాని ఈ వార్తలను నమ్మలేం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy