నల్లమల అడవుల్లో కార్చిచ్చు.. రెండు రోజులుగా అదుపులోకి రాని మంటలు

నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి( Nallamala Forest )లో మంటలు అదుపులోకి రావడం లేదు.

గత రెండు రోజులుగా మంటలు ఎగిసిపడుతుండగా అటవీశాఖ సిబ్బంది కార్చిచ్చును అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎండాకాలం కావడంతో ఎండిపోయిన ఆకులు, చెట్ల వలన మంటలు( Fire) విస్తరిస్తున్నాయి.వాటర్ ట్యాంకులు, అధునాతన యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు( Forest Officials ) ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు రెండు రోజులుగా మంటలు కొనసాగుతుండటంతో ఆహారం, నీళ్ల కోసం అడవి జంతువులు సమీపంలోని గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు