కల్కి సినిమాపై అల్లు అర్జున్ అదిరిపోయే రివ్యూ.. బన్నీకి మూవీ అంతలా నచ్చేసిందా?

కల్కి సినిమా( Kalki 2898 AD )కు సంబంధించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు రివ్యూలు ఇవ్వగా ఆ రివ్యూలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కల్కి సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బన్నీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కల్కి మూవీ బృందానికి నా అభినందనలు అని బన్నీ చెప్పుకొచ్చారు.కల్కి మూవీ అద్భుతమైన విజువల్ వండర్ అని బన్నీ అభిప్రాయపడ్డారు.

కల్కి సినిమాలో నా ఫ్రెండ్ ప్రభాస్ నటన అద్భుతమని అమితాబ్ నటన గురించి మాట్లాడటానికి మాటలు సైతం రావడం లేదని బన్నీ పేర్కొన్నారు.కమల్, దీపికా పదుకొనే, దిశా పటానీ నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదని బన్నీ వెల్లడించారు.ఈ సినిమా కోసం పని చేస్తున్న వాళ్లందరికీ నా అభినందనలు అని బన్నీ పేర్కొన్నారు.

భారతీయ సినిమా స్థాయిని పెంచిన నిర్మాతలకు అభినందనలు అని బన్నీ వెల్లడించారు.

Advertisement

ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సరిపడే మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమా కల్కి అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.బన్నీ ప్రస్తుతం పుష్ప ది రూల్( Pushpa 2 ) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రష్మిక, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బన్నీ చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించాయి.సాధారణంగా బన్నీ ఇతర హీరోల సినిమాల గురించి అరుదుగా మాత్రమే స్పందిస్తారు.

బన్నీ ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ కావాలని పుష్ప2 సినిమాతో భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.పుష్ప2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

అనుదీప్ సినిమాలో విశ్వాక్ సేన్ పాత్ర ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు