పుష్ప 2 కోసం బన్నీ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా ద్వారా హీరోగా ఎంతో గుర్తింపు పొందినటువంటి ఈయన తాజాగా ఈ సినిమాలోని తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు( Best National Award ) కూడా అందుకున్నారు.

ఇలా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగారు.

అయితే ఎవరూ కూడా ఇప్పటివరకు ఇలాంటి అవార్డు సొంతం చేసుకోలేదు ఇలాంటి ఘనత సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు.

ఇక ఈయనకు నేషనల్ అవార్డు రావడంతో ప్రస్తుతం ఈయన నటిస్తున్న పుష్ప 2 ( Pushpa 2 ) సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో పుష్ప 2సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి సైతం నేషనల్ అవార్డు రావడంతో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.

Advertisement

అల్లు అర్జున్ కిఈ స్థాయిలో క్రేజ్ వచ్చింది అంటే ఈయన తన సినిమా కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ( Allu Arjun Remuneration )విషయంలో కూడా భారీగానే మార్పులు వచ్చాయని చెప్పాలి.

పుష్ప సినిమా కోసం 40 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా కోసం సుమారు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏమాత్రం రెమ్యూనరేషన్ తీసుకోలేదట.ఈయన ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నార్త్ బెల్ట్ థియేట్రికల్‌ రైట్స్( North Theatrical Rights ) ని బన్నీ తీసుకుంటున్నారని సమాచారం.

అంటే హిందీ భాషలో ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్ రూపంలో అందుకోబోతున్నారని తెలుస్తోంది.అక్కడ ఇది రెండు వందల కోట్లు వసూలు చేస్తే సుమారు 110కోట్లు, మూడు వందల కోట్లు చేస్తే, 150కోట్లు బన్నీకి పారితోషికంగా వస్తాయి.

సినిమా సక్సెస్‌ని బట్టి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పాలి.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు