బన్నీ బొమ్మను కాలితో గీసి అభిమానం చాటుకున్న దివ్యాంగ అభిమాని.. ఏమైందంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప2(Pushpa 2).

సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కారుణ్య విషయం తెలిసిందే.

విడుదల తేదీకి మరొక ఏడు రోజులు మాత్రమే సమయం ఉంది.దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని విగవంతం చేశారు మూవీ మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి.ప్రస్తుతం ఈ సినిమా పై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.కాగా అల్లు అర్జున్(Allu Arjun) కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

Advertisement

అల్లు అర్జున్ పై అభిమానాన్ని ఒక్కొక్కరు విధంగా బయట పెడుతూ ఉంటారు.తాజాగా కూడా ఒక అభిమాని అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.అయితే సదరు అభిమానికి చేతులు లేకపోవడంతో కాళ్లతో ఏకంగా పుష్పరాజ్ బొమ్మ (Pushparaj bomma)వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆ బొమ్మను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

ఒక దివ్యాంగుడు బ‌న్నీపై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్న విధానం చూస్తే మతిపోవాల్సిందే.చేతులు లేని ఆ అభిమాని త‌న కాళ్ల‌నే చేతులుగా మ‌లుచుకుని పుష్ప‌ 2(pushpa 2) సినిమాలోని బ‌న్నీ జాత‌ర ఫోటోని ఎంతో అద్భుతంగా వేసాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అభిమాని ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేయడంతో పాటు బన్నీ సార్ దయచేసి నా కళను చూడాలని మీకోసం పుష్ప బొమ్మను గీశానని మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉందని ఇట్లు ధీరజ్ సాత్విల్కర్ అని పేర్కొన్నారు.ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పాటు బన్నీ(bunny) దృష్టికి వచ్చింది.

ఈ జాగ్రత్త‌లు తీసుకుంటే అల‌స‌ట అల్లాడిపోవాల్సిందే!
మ్యాడ్ 2 టీజర్ లో అదొక్కటి మాత్రం అదిరిపోయింది...

నా గుండెను టచ్ చేశావ్ అంటూ బన్నీ అతనికి సమాధానం ఇచ్చారు.మ‌రి ఆ అభిమానిని బ‌న్నీ నేరుగా క‌లుస్తారేమో చూడాలి మరి.కాగా ఆ వీడియో పై చూసిన బన్నీ ఫ్యాన్స్ ధీరజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అత‌డి అంతులేని అభిమానానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

Advertisement

తామెవ్వ‌రూ చెయ్య‌లేక‌పోయింది నీవ్వు చేసావ్ ధీర‌జ్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.నిజ‌మే క‌దా? బొమ్మ‌లు వేసే క‌ళ అన్న‌ది అంద‌రిలో ఉండ‌దు.కొంద‌రికే సొంతం.

కానీ ధీర‌జ్ కి చేతులు లేక‌పోయినా? త‌న కాళ్ల‌నే చేతులుగా మ‌లుచుకోవ‌డం ఎంతో స్పూర్తిదాయ‌కం చెప్పాలి.

తాజా వార్తలు