ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ : బన్నీ, సుకుమార్‌ కీలక అప్‌డేట్‌

నా పేరు సూర్య 2018 సంవత్సరం ఆరంభంలో విడుదల అయిన విషయం తెల్సిందే.ఆ చిత్రం ఫ్లాప్‌తో దాదాపు ఏడాది కాలం పాటు అల్లు అర్జున్‌ ఖాళీగానే ఉన్నాడు.

2019లో బన్నీ ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయాడు.ఆ లోటును భర్తీ చేసేందుకు 2020 అంటే ఈ ఏడాది రెండు సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాడు.

అందులో మొదటిది అల వైకుంఠ పురంలో సినిమాను సంక్రాంతికే విడుదల చేయబోతున్న బన్నీ తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.

వీరిద్దరి కాంబో మూవీ ఫైనల్‌ అయ్యి అర్థ సంవత్సరం దాటింది.అయినా కూడా షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదు.అల వైకుంఠపురంలో సినిమా సెట్స్‌పై ఉండగానే వీరి కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని వార్తలు వచ్చాయి.

Advertisement

కాని ఆ విషయమై క్లారిటీ లేదు.ఇక అల్లు అర్జున్‌, సుకుమార్‌ల మూవీ గురించి నిన్న జరిగిన అల వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్‌ నైట్‌ పార్టీలో ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది.

అదేంటి అంటే ఈ చిత్రంలో బన్నీ లుక్‌.

అల్లు అర్జున్‌ ఎప్పుడు కూడా విభిన్నమైన స్టైల్‌ను ఫాలో అవుతాడు.అందుకే ఆయన్ను స్టైలిష్‌ స్టార్‌ అంటారు.ఇక సుకుమార్‌ మూవీ కోసం కూడా బన్నీ చాలా విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నాడట.

సుకుమార్‌ గత చిత్రం రంగస్థలంలో రామ్‌ చరణ్‌ గడ్డం పెంచి విభిన్నంగా కనిపించాడు.అందుకే ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా గెడ్డం పెంచి రఫ్‌ లుక్‌తో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్

ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.సమ్మర్‌ చివర్లో కాకున్నా దసరా వరకు ఈ చిత్రంను విడుదల చేయాలని మెగా కాంపౌండ్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు