వైరల్ : కుక్కకు మేకప్ వేసిన యజమాని..!

పెంపుడు జంతువులు ఎన్ని ఉన్నా కానీ కుక్కది మాత్రం ప్రత్యేక స్థానం.కుక్కలు విశ్వాసానికి మారుపేరు.

మనుషులపై కుక్కలకు ఉన్న విశ్వాసం.మరే జంతువులకు ఉండదనడంలో అతిశయోక్తి లేదు.

ఒక్కసారి వాటిని ఆదరిస్తే.తమ ప్రాణం ఉన్నంత వరకూ యజమాని ఇంటిని కాపలా కాస్తుంటాయి.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కుక్కలను పెంచుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.కొందరైతే వివిధ జాతులకు చెందిన కుక్కలను కొనేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు.

Advertisement

కొన్ని కుక్కలకు అమితమైన తెలివితేటలు ఉంటాయి.మరికొన్ని కుక్కలు తమ యజమానులపై ఎనలేని ప్రేమను పెంచుకుంటుంటాయి.

యజమానులు కూడా అంతే.తమ కుక్కలను ఎంతో అపురూపంగా పెంచుకుంటుంటారు.

ఒక్కోసారి అవి మనుషులు చేసినట్టుగానే కొన్ని పనులు చేస్తూ నవ్విస్తుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

యజమాని తన బుల్‌డాగ్‌కు మేకప్ వేస్తుంటారు.ఆ మేకప్ వేస్తున్నంత సేపు ఆ కుక్క సిగ్గుపడుతూ.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

నవ్వుతూనే ఉంది. మేకప్‌ బ్రష్‌తో దాని ముఖంపై అలా రాస్తుంటే.

Advertisement

ఆనందంతో దాని ముఖం ముఖం బల్బులా వెలిగిపోతుంటుంది. కుక్కకు మేకప్ వేసే ఈ వీడియోని.

యానిమల్స్ హిలేరియస్‌ అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

సాధారణంగా బుల్‌డాగ్స్‌ అరుస్తూ.కోపంగా ఉంటాయి.

అయితే ఈ వీడియోలోని బుల్‌డాగ్‌ మాత్రం నవ్వుతూ.ఎంతో ప్రశాంతంగా ఉంది.

దీంతో ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ కుక్క భలేగా సిగ్గుపడుతోంది, వీడియో చాలా బాగుంది, ఆ కుక్క మేకప్ లో భలే క్యూట్ గా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.