రామ్ చరణ్ తో తీసే మూవీ పక్కా హిట్.. మెగా ఫ్యాన్స్ కు బుచ్చిబాబు హామీ ఇదే!

టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, బుచ్చి బాబు(buchi babu, ram charan) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆర్సీ 16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా నటుడు బ్రహ్మాజీ ప్రధానపాత్రలో తెరకెక్కిన బాపు చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా బుచ్చిబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్‌ చరణ్‌ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్‌ చేశారు.

Advertisement

ఈ సందర్భంగా బుచ్చిబాబు(Buchi babu) మాట్లాడుతూ.మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు.ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతోంది.

ఉప్పెన సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తుంది.థియేటర్‌ గేట్‌ బయట నిలబడి సినిమా బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారట.

ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌ కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.నేను ప్రస్తుతం తీస్తున్న రామ్‌ చరణ్‌(Ram Charan) సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అని తెలిపారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.రామ్‌ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన గేమ్‌ ఛేంజర్‌(Game changer) ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడంతో ఆయన అభిమానులు Rc 16పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

Advertisement

బుచ్చి బాబు తన కామెంట్స్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క వార్తా కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.

తాజా వార్తలు