రోజు ఈ విధంగా బ్రష్ చేశారంటే మీ దంతాలు తెల్లగా దృఢంగా మారడం ఖాయం!

సాధారణంగా కొందరి దంతాలు గార ప‌ట్టేసి పసుపు రంగులో ఉంటాయి.ఇటువంటి దంతాలు కలిగిన వారు నలుగురిలో ధైర్యంగా మాట్లాడేందుకు భయపడుతుంటారు.

హాయిగా నవ్వేందుకు సంకోచిస్తుంటారు.ఎక్కడ తమ దంతాలను చూసి కామెంట్ చేస్తారో అని ప్రతి నిత్యం స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

ప‌సుపు దంతాల‌ను తెల్ల‌గా మెరిపించుకునేందుకు ఖ‌రీదైన టూత్ పేస్ట్‌ల‌ను వాడుతుంటారు.అయినా స‌రే ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలియ‌క మ‌ద‌న ప‌డుతుంటారు.

అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా రోజు బ్రష్ చేశారంటే దంతాలు తెల్లగా( White teeth) దృఢంగా మారడం ఖాయం.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వేప పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి.

Advertisement
Brushing This Way Is Sure To Make Your Teeth Whiter And Stronger! Teeth Whitenin

అలాగే చిటికెడు బేకింగ్ సోడా, రెండు చుక్కలు పిప్పరమింట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )మరియు కొద్దిగా వాటర్ వేసుకుని అన్ని కట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Brushing This Way Is Sure To Make Your Teeth Whiter And Stronger Teeth Whitenin

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి బ్రష్ సహాయంతో దంతాలకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఇలా చేశారంటే దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు క్రమంగా మాయం అవుతాయి.

దంతాలు తెల్లగా మెరుస్తాయి.దృఢంగా తయారవుతాయి.

వైట్ అండ్ హెల్తీ టీత్ ను కోరుకునే వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని పాటించడం వల్ల నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.అలాగే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అనేది మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య.

Advertisement

నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, హార్మోన్ల మార్పులు, ప‌లు ర‌కాల మందుల‌ వాడకం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు.అయితే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంద‌ని బాధ‌ప‌డుతున్న వారు పైన చెప్పిన విధంగా బ్ర‌ష్ చేసుకుంటే మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికిన‌ట్లే.

తాజా వార్తలు