సుకేశ్ వాట్సాప్ చాట్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ వాట్సాప్ చాట్ లను ఆయన న్యాయవాది బయటపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ వాట్సాప్ చాట్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

సుకేశ్ తో తనకు పరిచయం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.ఫేక్ చాట్ లతో తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక తనపై దాడి చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement