సీబీఐ కస్టడీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) సీబీఐ కస్టడీలో ఉన్నారు.

ఈ మేరకు ఢిల్లీలోని( Delhi ) సీబీఐ కేంద్ర కార్యాలయంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi liquor scam case ) అరెస్ట్ చేసిన ఆమెను సీబీఐ విచారిస్తుంది.మౌఖికంగా, లిఖిత పూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కీలక విషయాలపై విచారణ కొనసాగుతోంది.

లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారిగా సీబీఐ పేర్కొంది.ఈ క్రమంలోనే కవిత, బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు.

దాంతోపాటు సౌత్ గ్రూప్ మెంబర్స్ స్టేట్ మెంట్లపై కూడా ఆరా తీస్తున్నారు.కాగా సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement
ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు

తాజా వార్తలు