బి‌ఆర్‌ఎస్ తో ఆ రెండు పార్టీలకు ముప్పే !

మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ ( BRS )దూకుడు కొనసాగుతూనే ఉంది.

దేశ రాజకీయాల్లోకి కే‌సి‌ఆర్ ( CM KCR )ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆ పార్టీని అన్నీ రాష్ట్రాలలో విస్తరించేందుకు కే‌సి‌ఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రలపై కే‌సి‌ఆర్ గట్టిగా కన్నెశారని చెప్పాలి.అందులో భాగంనే తీవ్ర రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో ( Maharastra )ముందుగా పార్టీని బలపరచాలని కే‌సి‌ఆర్ పట్టుదలగా ఉన్నారు.

ఇప్పటికే ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ సక్సస్ అవుతుండడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ హాట్ టాపిక్ అయింది.

ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బి‌ఆర్‌ఎస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి.దాంతో రాబోయే రోజుల్లో అక్కడి స్థానిక పార్టీలకు కూడా బి‌ఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజాగా అక్కడ అధికారంలో ఉన్న ఏక్ నాథ్ షిండే( ek Nadh Shinde ) వర్గానికి షాక్ ఇస్తూ సౌత్ నాగ్ పూర్ అసెంబ్లీ నియోజిక వర్గానికి చెందిన ప్రవీణ్ షిండే బి‌ఆర్‌ఎస్( Praveen shinde ) గూటికి చేరారు.

Advertisement

నిజంగా ఇది శివసేన ( షిండే వర్గం ) కు పెద్ద దేబ్బే అని చెప్పాలి.ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజిక వర్గం కావడంతో అటు బిజెపి, ఇటు శివసేన కు రెండిటికి ఈ పరిణామం గట్టి హెచ్చరికే అని చెబుతున్నారు విశ్లేషకులు.

ఇక రాబోయే రోజుల్లో బీజేపీ, శివసేన పార్టీల నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి చేరికలు మరింత పెరిగే అవకాశం ఉంది.బి‌ఆర్‌ఎస్ దూకుడు ఇలాగే కొనసాగితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి స్థానిక పార్టీలకు సైతం గట్టి పోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.కే‌సి‌ఆర్ కూడా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ బి‌ఆర్‌ఎస్ ను తిరుగులేని శక్తిగా మలుస్తున్నారు.

కాగా మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ ప్రభావాన్ని ఇలాగే కొనసాగితే.అదే జోష్ తో ఇతర రాష్ట్రాలపై కూడా రెట్టింపు ఉత్సాహంతో కే‌సి‌ఆర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది.

మొత్తానికి మహారాష్ట్ర టార్గెట్ గా బి‌ఆర్‌ఎస్ వేసిన తొలి అడుగు గ్రాండ్ సక్సస్ అవుతున్నట్లే కనిపిస్తోంది.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు