పూటకో కొర్రీ... రేవంత్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఫైర్ 

కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) ప్రజా వ్యతిరేక విధానాలపైనా,  ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) తీవ్రంగా మండిపడింది.

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించింది.

  తెలంగాణ రైతులకు( Telangana Farmers ) పెట్టుబడి సాయం ఎగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.అన్నదాతలకు రైతు భరోసా( Rythu Bharosa ) అందించకుండా కమిటీల పేరుతో ఇప్పటివరకు కాదయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాటిలైట్ సర్వేల ద్వారా పంట సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తామంటూ ఇప్పుడు పూటకో కొర్రి పెడుతూ రేవంత్ సర్కార్ రైతులను దగా చేస్తోందని బిఆర్ఎస్ మండిపడింది.

Brs Fires On Cm Revanth Reddy Over Rythu Bharosa Scheme Details, Telangana Gover

ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నా,  ఏడూ ఎకరాలకే రైతు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.  అది కూడా కుటుంబంలో ఒక్కరికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది.సాధారణంగా తండ్రి విచక్షణ మేరకు పిల్లలకు భూమిని పంచుతారు.

Advertisement
Brs Fires On Cm Revanth Reddy Over Rythu Bharosa Scheme Details, Telangana Gover

  కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా ఇస్తే,  20 లక్షల మందికి మొండి చేయి చూపించినట్లు అవుతుంది.పంట రకాన్ని బట్టి పెట్టుబడి సాయంకి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది .రైతు భరోసా కోత మార్గాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది .నాడు రైతుల పట్ల కెసిఆర్ మానవీయత చాటుకుంది. 

Brs Fires On Cm Revanth Reddy Over Rythu Bharosa Scheme Details, Telangana Gover

నేడు నిర్ధయ గా కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తుంది.  రైతుబంధు రెండు సీజన్లకు అందలేదు.  రుణమాఫీ అరకొరగా ముగించేశారు.

  బోనస్ నాలుగో వంతు సన్నాలకైనా దక్కలేదు .ఈ మూడు సంఘటనలతో కాంగ్రెస్ చెబుతున్న మాటలకు చేతలకు మధ్య పొంతనలేదని తేలిపోయింది.  దీంతో సంక్రాంతి నుంచి రైతు భరోసా అని సర్కార్ చెప్తున్నా , రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

  ఎన్ని కొర్రీలు పెడతారోనని,  ఇంకెంత కోత విధిస్తారోనని అన్నదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు .ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే అది కూడా ఏడెకరాలకే రైతు భరోసా ఇస్తారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది   అంటూ బీ ఆర్ ఎస్ ట్వీట్ చేసింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు