BRS Kaleshwaram : కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట..!!

కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది.

ఈ మేరకు మార్చి ఒకటోవ తేదీన ‘చలో మేడిగడ్డ( Chalo Medigadda )’ కు పిలుపునిచ్చింది.

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కలిసి మేడిగడ్డకు వెళ్లనున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను వివరించనుంది.

అలాగే మేడిగడ్డపై అసలు నిజాలను ప్రజల ముందు పెడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు.

అనంతరం మార్చి 10న కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ( KCR )హాజరుకానున్నారు.కాగా కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ తమపై అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడుతోంది.

Advertisement

ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement