మాజీ మంత్రి నారాయణపై తమ్ముడు భార్య సంచలన వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి నారాయణ( Narayana Ponguru ) పై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

నారాయణ ఒక డేగ లాగా తనపై కన్నేసాడు అంటూ ఆరోపణలు చేసింది.

"డేగ ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.ఇంట్లో భార్య ఉండగానే.

అన్నం తీసుకు రాలేదని నారాయణ కొట్టాడు.టార్చర్ చేసేవాడు" అని నారాయణ తమ్ముడు భార్య సంచలన ఆరోపణలు చేసింది.

ఇంట్లో అనేక చిత్రహింసలకు గురి చేసే వాడని పేర్కొంది.ఈ విషయాలన్నిటిని ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

Advertisement

అంతేకాదు గత ఎన్నికల సమయంలో ప్రచారం చేయాలని నారాయణ తనని ఇబ్బంది పెట్టినట్లు కూడా ప్రియా వీడియోలో ఆరోపణలు చేసింది.ఈ క్రమంలో తన కుటుంబాన్ని కూడా నారాయణ అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ( TDP )తరఫున ప్రచారం చేయడానికి తన మనసు అంగీకరించలేదని స్పష్టం చేసింది.ప్రియా( Priya ) ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు