ఈ జీతంతో పూటగడిచేదెలాని బోరున ఏడ్చిన బోరిస్ జాన్సన్ ఏకంగా రూ.38 కోట్లతో ఇల్లు కొనేశాడు?

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ( Boris Johnson )గురించి అందరికీ తెలిసిందే.ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

ఆయన తన ప్రధానమంత్రి పదవిని చేజేతులా కోల్పోయిన సంగతి అందరికీ విదితమే.మనోడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండి నానా ఇబ్బంది పడుతుంటే బోరిస్ మాత్రం తన అధికారిక భవనం 10 డౌనింగ్‌ స్ట్రీట్ మిత్రులతో కలిసి మందు పార్టీలు చేసుకుంటూ చిందులు వేస్తూ బిజీగా గడిపారు.

ఇది కాస్తా మీడియాకు ఎక్కడంతో బ్రిటన్‌ పార్లమెంటు( Parliament of Great Britain )లో పెద్ద దుమారమే చెలరేగింది.

ఆ సంగతి పక్కనబెడితే బోరిస్‌ గురించి హాట్‌ టాపిక్‌ బ్రిటన్‌( Britain )లో ఇపుడు చక్కర్లు కొడుతోంది.మాజీ ప్రధానమంత్రిగా తనకు వచ్చే జీతం 2 లక్షల డాలర్లు.అంటే మన భారతీయ కరెన్సీలో ఏడాదికి సుమారు 1.6 కోట్ల రూపాయలుగా ఉంటుంది.ఈ సొమ్ముతో మనోడు అప్పట్లో ఎలా బతికేది అంటూ బీద అరుపులు అరిచిన సంగతి విదితమే.అలాంటి జాన్సన్‌ ఏకంగా 4.7 మిలియన్‌ డాలర్లు పెట్టి ఓ పురాతన ఇంటిని కొనుగోలు చేయడంతో బ్రిటన్ ప్రజలు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు.

Advertisement

అవును, 4.7 మిలియన్‌ డాలర్స్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 38 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు.ఇకపోతే ప్రజలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రాకుండా ఆయన కందకాలు కూడా తవ్విస్తున్నారని వినికిడి.ఈ భవనం తొమ్మది బెడ్‌ రూమ్స్ తో తయారైన ఇళ్ళని సమాచారం.1600 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించగా ఎప్పటికీ భవనం సజీవంగా ఉండడం కొసమెరుపు.గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మకానికి వున్న ఆ ఇంటిని జాన్సన్ ఇపుడు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.దాంతో బీద అరుపులు అరస్తున్న జాన్సన్‌ ఏకంగా 4.7 మిలియన్‌ డాలర్లు పెట్టి ఇంటిని ఎలా కొనుగోలు చేశారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.దీని గురించి బోరిస్‌ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు