ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నరేంట్రా బాబు.. హల్దీ వేడుకల్లో డాన్స్ చేసిన డైనోసోర్..!

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెళ్లి వేడుకల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వివాహ వేడుకల్లో జరిగే వినోదం, కొత్తదనం, వినూత్న గెటప్‌లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా వధూవరులు ప్రత్యేకంగా దుస్తులు ధరించి, నృత్యాలు చేస్తూ, అతిథులను ఆశ్చర్యపరిచే సంఘటనలు ఇటీవల తరచుగా దర్శనమిస్తున్నాయి.అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన హల్దీ వేడుకలో వధువు చేసిన సర్ప్రైజ్ అందరినీ అవాక్కు చేసింది.

అది హల్దీ వేడుక సమయం.పెళ్లికి ముందు జరిపే ఈ ప్రత్యేక కార్యక్రమానికి వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు హాజరయ్యారు.అందరూ ఆటలు ఆడుతూ, ముద్దుగా హల్దీ కొడుతూ వేడుకను జోష్‌గా జరుపుకుంటున్నారు.

Advertisement

పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో పాల్గొంటున్నాడు.కానీ పెళ్లి కూతురు మాత్రం ఇప్పటివరకు రాలేదు.

అందరూ ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే, అప్పుడే వేడుకకు మధ్యలో డైనోసోర్ గెటప్‌లో ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు.అతిథులందరినీ పలకరించడంతో, అందరూ ఆశ్చర్యపోయారు.కొంత సమయం తర్వాత ఆ డైనోసోర్ గెటప్‌ను తీస్తే అందులో పెళ్లి కూతురు కనిపించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఈ ఊహించని గెటప్ చూసి పెళ్లి కొడుకుతో సహా అతిథులంతా నవ్వుతూ సరదాగా స్పందించారు.ఆ తర్వాత వధూవరులు కలిసి అదే గెటప్‌లో డాన్స్ చేస్తూ హల్దీ వేడుకను మరింత వినోదంగా మార్చారు.

న్యూస్ రౌండర్ టాప్ 20

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోపై నెటిజన్స్ భారీగా స్పందిస్తున్నారు.ఇంకా ఈ వీడియో చూసిన కొందరు మీ క్రియేటివిటీకి ఓ దండం అని కొందరు కామెంట్ చేస్తుంటే.

Advertisement

మరికొందరేమో, ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నరేంట్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వినూత్నమైన పెళ్లి సంఘటనలు ప్రజలకు ఆనందాన్ని అందించడమే కాకుండా, వివాహ వేడుకల్లో క్రియేటివిటీకి మారు పేరు అయిపోతున్నాయి.

ఈ వీడియో కూడా అదే తరహాలో ఆకట్టుకుంది.

తాజా వార్తలు