బ్రేకింగ్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సర్కార్ ఉప సంహరించుకుంది.

రాజ్యాంగం ప్రకారమే వ్యవహారిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.ఈ మేరకు గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే న్యాయస్థానానికి వెల్లడించారు.

అయితే రాష్ట్ర బడ్జెట్ కూ గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం లేదంటూ, ఆమె తీరును నిరసిస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో మార్పు చోటుచేసుకుంది.

ఈ మేరకు ఫిబ్రవరి 3 బదులు ఫిబ్రవరి 6న బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!