బ్రేకింగ్: రష్యా -గోవా చార్టర్డ్ ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు

రష్యా -గోవా చార్టర్డ్ ఫ్లైట్‎కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.బెదిరింపు కాల్ హెచ్చరికల నేపథ్యంలో చార్టర్డ్ ఫ్లైట్ ను ఉజ్బెకిస్తాన్ కు మళ్లించారు.

బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు ఒక్కసారిగా హడలిపోయారు.విషయం తెలుసుకున్న గోవా అధికార యంత్రాంగం సంబంధిత వర్గాలకు సమాచారం అందించారు.వెంటనే ఆ విమానాన్ని ఉజ్బెకిస్తాన్ లో అత్యసవర ల్యాండింగ్ చేశారు.

కాగా రష్యా నుంచి గోవా బయలుదేరిన విమానంలో ఏడుగురు సిబ్బందితో పాటు మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు.కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విమాన సంస్థకు చెందిన విమానంలో బాంబు ఉందని బెదిరింపుల కాల్ వచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు బెదిరింపులు చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు